
బాహుబలి 1 సినిమా కన్నా బాహుబలి 2 సృష్టించే వసూళ్ల బీభత్సం అందరం చూస్తూనే ఉన్నాం. ఇండియన్ సినిమా హిస్టరీలో కని విని ఎరుగని రీతిలో బాహుబలి కన్ క్లూజన్ కలక్షన్స్ వరద పారిస్తుంది. ఓవర్సీస్ లో హాలీవుడ్ సినిమాలనే షేక్ ఆడిస్తున్న బాహుబలి నైజాంలో కూడా న భూతో న భవిష్యత్ అన్న రేంజ్ లో కలక్షన్స్ వసూళు చేస్తుంది.
రిలీజ్ అయిన 11 రోజులకే దాదాపు 50 కోట్ల దగ్గరగా నైజాంలో కలక్షన్స్ సాధించింది బాహుబలి. మొదటి పార్ట్ దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు ఘడించాడు. కాని ఈసారి అడ్వాన్స్ రూపంలో డైరెక్ట్ గా ఇచ్చారు. సినిమా 40 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగాం రిలీజ్ ముందు అంత వసూళు చేస్తుందా అని డౌట్ పడ్డారు కాని పరిస్థితి చూస్తుంటే లాంగ్ రన్ లో 60 కోట్ల దాకా వసూళ్లు రాబట్టే అవకాశాలు కనబడుతున్నాయి.
సో మొత్తానికి నైజాంలో సినిమా కలక్షన్స్ లో బాహుబలి ఓ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. బాహుబలి సినిమా కలక్షన్స్ లో నైజం వసూళు భారీ స్థాయిలో నిలబడటం విశేష. ఏరియా వైజ్ గా కూడా నైజాం కలక్షన్స్ ను అందుకోవడం మిగతా మరే సినిమా వల్లా కాదని చెప్పొచ్చు.