
సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ఓ మ్యూజిక్ టూర్ లో భాగంగా అమెరికాలో ఉంది. ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న చిన్మయి కార్ ను కొందరు దుండగులు ధ్వసం చేసి మరి ఆమె వస్తువులను తీసుకెళ్లారట. తన ఇంట్లో ఉండగానే ఇదంతా జరుగుతుందని గమనించిన చిన్మయి 5 నిమిషాలకు అసలు విషయం తెలుసుకుందట.
కార్ ను పూర్తిగా ధ్వంసం చేయడం తన విలువైన వస్తువులు వారు తీసుకుపోవడం పట్ల తాను దేవుడా ఇంకెవరితోనైనా ఆడుకో అంటూ ట్వీట్ చేసింది. ఇక ఆపద సమయంలో తన పక్క ఫ్లాట్ యమమాని.. పోలీసులు కూడా సహకరించిన తీరుని మెచ్చుకుంది. తన వస్తువులన్ని మళ్లీ తిరిగి అందించే ఏర్పాట్లు చేయడంతో ఆమె కాస్త కుదట పడ్డదట. తను ఉంటున్న ఏరియా తరచు ఇలా దొంగల భారీన పడటం కామనే అని పోలీసులు చెప్పారని చిన్మయి ట్వీట్ చేసింది.