బిజీ బాబుకి బాగానే వచ్చినట్టున్నాయ్..!

బాహుబలికి పోటీగా లాస్ట్ ఫ్రై డే రిలీజ్ అయిన సినిమా బాబు బాగా బిజీ.. అవసరాల శ్రీనివాస్ హీరోగా చేసిన ఆ సినిమా హంటర్ రీమేక్ గా తెరకెక్కించబడింది. అయితే అనుకున్న రేంజ్ లో సినిమా మాత్రం వర్క్ అవుట్ కాలేదు. ప్రేక్షకులు ఊహించిన అంశాలేవి లేకపోవడంతో బాబు బాగా బిజీ సినిమా చూసి పెదవి విరిచారు తెలుగు ఆడియెన్స్.

అంతేకాదు అవసరాల ఇమేజ్ డ్యామేజ్ చేసేలా సినిమా ఉందని వార్తలొచ్చాయి. కాని ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయం ఏంటి అంటే బాబు బాగా బిజీ ద్వారా అవసరాల శ్రీనివాస్ ఏకంగా కోటిన్నర రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. సో నాలుగు నెలల్లో కోటిన్నర అంటే బాబుకి బాగానే ముట్టిందని చెప్పొచ్చు. సపోర్టెడ్ ఆర్టిస్ట్ గా కెరియర్ కొనసాగిస్తున్న అవసరాల శ్రీనివాస్ హీరోగా ఇలాంటి సినిమా చేశాడని అనుకుంటున్నా పారితోషికం బాగానే రావడంతో తను మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నాడని తెలుస్తుంది.