మహేష్ తోనే జనగణమన.. ఇది ఫిక్స్..!

అప్పటిదాకా మహేష్ కు ఉన్న ఇమేజ్ ను డబుల్ చేస్తూ ప్రిన్స్ మహేష్ ను కాస్త సూపర్ స్టార్ మహేష్ చేసిన సినిమా పోకిరి. తెలుగు సినిమా చరిత్రలో పోకిరి ఓ సంచలన రికార్డులను సృష్టించింది. పూరి టేకింగ్ మహేష్ యాక్టింగ్ సినిమాను ఆ స్థాయిలో నిలబెట్టాయి. అయితే ఆ సినిమా తర్వాత రెండోసారి బిజినెస్ మ్యాన్ గా పూరి మహేష్ లు మ్యాజిక్ చేశారు. ఆ సినిమా కూడా ప్రేక్షకులను అలరించింది.

ఇక ముచ్చటగా మూడోసారి జనగణమన సినిమాతో కలిసి పనిచేయాలని చూస్తున్నాడు పూరి జగన్నాధ్. మహేష్ కోసం రాసుకున్న కథకు తానే జనగణమన అని టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడు. అయితే ఈ సినిమా కోసం మహేష్ డేట్స్ మాత్రం అడ్జెస్ట్ చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న పూరి రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తాను జనగణమన తీస్తే మహేష్ తోనే తీస్తానని అన్నాడు. సాధారణంగా ఓ కథ కోసం 15 రోజుల నుండి 30 రోజులు టైం తీసుకునే పూరి జనగణమన కోసం రెండు నెలలు కష్టపడ్డాడట. మరి చూస్తుంటే పూరి మరోసారి మహేష్ తో పోకిరిని తలదన్నే రికార్డ్ క్రియేటెడ్ మూవీ తీస్తాడని అనిపిస్తుంది.