పీటర్ హెయిన్స్ స్టార్ట్ కెమెరా యాక్షన్..!

కొంపదీసి పీటర్ హెయిన్స్ హీరో కాబోతున్నాడా అని టైటిల్ చూసి కాస్త కంగారు పడొచ్చు.. పీటర్ హెయిన్స్ ప్రస్తుతం తన గురిని ఫైటింగ్స్ నుండి డైరక్షన్ మీదకు మళ్లించాడట. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పీటర్ హెయిన్స్ ఓ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇటావలే పీటర్ హెయిన్స్ మోహన్ లాల్ కు కథ వినిపించడం అది ఆయన ఓకే చేయడం అంతా జరిగిందట.  


మోహన్ లాల్ నటించిన పులి మురుగన్ తెలుగులో మన్యం పులి సినిమాకు బెస్ట్ ఫైట్ మాస్టర్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు పీటర్ హెయిన్స్. ఇక ఆ సినిమా టైంలోనే మోహన్ లాల్ కు కథ వినిపించడం అది నచ్చి ఆయన ఓకే చేయడం అంతా జరిగిందట. సో మొత్తానికి ఫైట్ మాస్టర్ నుండి డైరక్టర్ గా పీటర్ హెయిన్స్ సరికొత్త భాధ్యతలను నెత్తిన వేసుకోబోతున్నాడన్నమాట. మరి ఫైట్ మాస్టర్ గా ఎలా క్లిక్ అయ్యాడో డైరక్టర్ గా కూడా పీటర్ ఇరగదీసేయాలని ఆశిద్దాం.