
క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ డైరక్షన్ లో సందీప్ కిషన్, రెజినా జంటగా నటిస్తున్న సినిమా నక్షత్రం. కొద్ది కాలంగా విడుదలకు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతుంది. నిన్న రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే కృష్ణవంశీ మళ్లీ తన పనితనం ఏంటో చూపించబోతున్నాడు అని చెప్పొచ్చు. టీజర్ ఫుల్ ప్యాక్డ్ ఎనర్జీతో వచ్చింది. సాయి ధరం తేజ్, ప్రగ్యా జైశ్వాల్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ చేస్తుండటం విశేషం.
రెజినా, ప్రగ్యా గ్లామర్ తో పాటుగా సందీప్, సాయి ధరం తేజ్ ల పవర్ ఫుల్ యాక్షన్ ఈ సినిమాకు హైలెట్ అవనుంది. సినిమా టీజర్ తోనే తన సత్తా చూపించిన కృష్ణవంశీ చూస్తుంటే ఈ సినిమాతో తను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేసేలానే ఉన్నాడని అనిపిస్తుంది. ఈ సినిమా అటు సందీప్ కిషన్ కు, కృష్ణ వంశీకి హిట్ కావాల్సిందే. లేదంటే మాత్రం కెరియర్ సంక్షోభంలో పడే అవకాశం ఉంది.