
నందమూరి బాలకృష్ణ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ముహుర్తం రోజే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసిన పూరి అందుకుగాను ఫుల్ స్పీడ్ తో షూటింగ్ చేస్తున్నారట. ఈ క్రమంలో బాలయ్య కాస్త ఇబ్బందికి గురవుతున్నట్టు టాక్. బాలకృష్ణ కాస్త రెస్ట్ కావాలని అడుగుతున్నా సరే అనుకున్న టైంకు సినిమా పూర్తి చేయాలని పూరి వరుసగా షూటింగ్ చేస్తున్నాడట.
సెప్టెంబర్ 29న పూరి బాలయ్య సినిమాను రిలీజ్ ఫిక్స్ చేశాడు. అందుకే షూటింగ్ చక చకా కానిచ్చేస్తున్నాడట. శాతకర్ణి కోసమే రెస్ట్ లేకుండా సినిమా పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు పూరి సినిమాకు కూడా అదే రేంజ్ లో వర్క్ అవుట్ చేయడం కాస్త ఇబ్బందికరంగా మారిందట. మరి బాలయ్య బాధను పూరి అర్ధం చేసుకుని కొద్దిరోజులు షూటింగ్ ఆపేస్తే బెటర్. పూరి మాత్రం బడ్జెట్ కంట్రోలింగ్ కోసం ఇలా వరుస షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట. మరి హీరో బాధని కూడా అర్ధం చేసుకుంటే మంచిదని పూరికి సలహాలిస్తున్నారు కొందరు.