
ప్రేమం సినిమాలో నటించిన అనుపమ పరమేశ్వరన్ శతమానం భవతితో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. ప్రేమం సినిమాలో అనుపమ విషయంలో తన ప్రేమను త్యాగం చేసిన నాగ చైతన్య ఈసారి మాత్రం ఆమెను విడిచేది లేదని అంటున్నాడు. ఇంతకీ విషయం ఏంటి అంటే ప్రస్తుతం నాగ చైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా తర్వాత చందు మొండేటి డైరక్షన్ సినిమా చేస్తున్న చైతు దానితో పాటుగా నూతన దర్శకుడు కృష్ణతో మరో సినిమా చేస్తునాడట.
ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. శర్వా శతమానం భవతితో సూపర్ హిట్ అందుకున్న అనుపమ నటించబోయే తర్వాత క్రేజీ ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఎనర్జిటిక్ స్టార్ రాం తో కలిసి నటిస్తున్న అనుపమ టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. మరి ప్రేమం జంట ఈసారి కూడా అదే ఫలితాన్ని అందుకుంటారో లేదో చూడాలి.