
మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ రాజమండ్రి దగ్గర కొల్లేరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కు కొద్దిపాటి గ్యాప్ ఇచ్చారు చిత్రయూనిట్. అయితే అక్కడ అభిమానుల ఆదరాభిమానాలకు చెర్రి ఫిదా అయ్యాడట. ఇక కొందరైతే తమ అభిమాన నటుడికి సర్ ప్రైజ్ గిఫ్టులిచ్చారట.
ఇక పశ్చిమ గోదావరి, భీమవరం ప్రాంత అభిమానులైతే చరణ్ కు ఓ పందెం కోడిని గిఫ్ట్ గా ఇచ్చారట. పందెం కోళ్లకు బాగా పాపులర్ అయిన ఈ ఏరియా.. సంక్రాంతి వచ్చిందంటే చాలు సరదా మొదలైనట్టే. రాం చరణ్ కు ఓ పందెం కోడిని కానుకగా ఇచ్చారట. తనకు అభిమానులు ఇచ్చిన గిఫ్ట్ తో సెల్ఫీ దిగి అందరికి చూపిస్తున్నాడు రాం చరణ్. ప్రస్తుతం స్వామి మాలలో ఉన్న చెర్రి మాలధారణ తీసివేశాక మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది.