స్టార్ హీరోయిన్ తో రానా ఎఫైర్..!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన రానా హీరోయిన్స్ ఎఫైర్ విషయంలో కూడా అంతే స్పీడ్ గా ఉంటాడ్. ఇప్పటికే త్రిషాతో కొన్నాళ్లు చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈ దగ్గుబాటి హీరో ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడని టాక్. ఎక్కడ చూసినా ఇద్దరు చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నారట. ఇన్నాళ్లు మెగా గ్యాంగ్ తో క్లోజ్ గా ఉన్న రకుల్ సడెన్ గా రానాకు దగ్గరైందట.

ఇద్దరి మధ్య సీరియస్ రిలేషన్ నడుస్తుందని ఫిల్మ్ నగర్ టాక్. టాలీవుడ్ లో రకుల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే.. ఇక బాహుబలితో రానా నేషనల్ వైడ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అందుకే ఈ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నట్టు తాజా రూమర్. ఈ వార్తలపై రానా రకుల్ ఎలా స్పందిస్తారో ఏమో కాని ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు జోరందుకున్నాయి.