
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సినిమా సాహో. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ను అలరిస్తుంది. రక్తపు మరకలతో స్టైలిష్ గా కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో విలన్ గా కూడా స్టైలిష్ యాక్టర్ ను తీసుకున్నారని టాక్. కోలీవుడ్ లో హీరోగా సక్సెస్ అయ్యి కొద్దికాలం కెరియర్ గ్యాప్ ఇచ్చి విలన్ గా సూపర్ రీ ఎంట్రీ ఇచ్చిన అరవింద్ స్వామి సాహో విలన్ గా చేసే అవకాశాలున్నాయట.
యువి క్రియేషన్స్ పతాకంలో దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో స్కై ఫైట్ కూడా చేస్తున్నారట. ఇప్పటికే హీరోయిన్ విషయంలో బాలీవుడ్ భామని దించే ఆలోచనలో ఉన్న సాహో టీం అరవింద్ స్వామిని కూడా విలంగా తీసుకుంటే సినిమాకు అదనపు ఆకర్షణగా ఉంటుందని ఆయన్ను తీసుకుంటున్నారట. లాస్ట్ ఇయర్ ధ్రువతో విలన్ గా సూపర్ హిట్ అందుకున్న అరవింద్ స్వామి ప్రభాస్ తో ఎలా ఫైట్ చేస్తాడో చూడాలి.