
ప్రేమను ఇచ్చుపుచ్చుకునే క్రమంలో కానుకలు ఇచ్చుకోవడం మాములే ఇక త్వరలో పెళ్లి చేసుకోబోయే జంట అయితే ఈ హంగామా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం నాగ చైతన్య, సమంతల జోష్ ఇదే రేంజ్ లో ఉంది. తనకు కాబోయే భర్త మీద ప్రేమతో సమంత ఓ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చింది శ్యామ్. దాదాపు కోటిన్నర విలువగల బిఎండబల్యు లక్సరియస్ కార్ చైతు కోసం సమంత గిఫ్ట్ ఇచ్చిందట.
ఇప్పటికే స్పోర్ట్స్ బైకులంటే ఇష్టమున్న చైతుకి ఇదవరకు కాస్ట్ లీ స్పోర్ట్స్ బైక్ కొనిచ్చిన సమంత ఇప్పుడు బిఎండబల్యు కార్ కానుకగా ఇవ్వడం అందరికి ఆశ్చర్యపరుస్తుంది. ఇద్దరు ఒకరికొకరు చూపించుకుంటున్న ఈ ప్రేమను చూసి అందరు ముచ్చటపడుతున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్న ఈ ఇద్దరు కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసుకుని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారు.