ఛాన్స్ ఇచ్చిన నిర్మాతకే షాక్ ఇచ్చిన హీరోయిన్..!

మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన భామలకు టాలీవుడ్ లో మంచి గిరాకి ఉంటుంది. మలయాళ ప్రేమంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనుపమ తెలుగులో ఆ సినిమా రీమేక్ లో కూడా ఆకట్టుకుంది. ఇక త్రివిక్రం అఆలో గడుసు పిల్లగా అలరించిన అనుపమ శతమానం భవతి సినిమాతో సోలో హిట్ అందుకుంది. శతమానం భవతి కోసం దిల్ రాజు పిలిచి మరి అనుపమకు అవకాశం ఇచ్చాడు.  

ఆ సినిమా అనుపమకు మంచి మైలేజ్ ఏర్పడేలా చేసింది. అయితే ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిన దిల్ రాజుకే షాక్ ఇచ్చిందట అనుపమ. నానితో దిల్ రాజు నిర్మిస్తున్న ఎం.సి.ఏ మూవీలో ముందు అనుపమ పరమేశ్వన్ నే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. అనుపమకు ఈ ఆఫర్ ఇస్తే రెమ్యునరేషన్ డబుల్ ఇస్తేనే గాని సినిమా చేయనని చెప్పేసిందట. ఒక్క హిట్ సినిమాకే అనుపమ ఇలా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం దిల్ రాజుకి నచ్చలేదు. అందుకే సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. మరి లీడింగ్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుకి హ్యాండ్ ఇచ్చి ఎలా అవకాశాలు సంపాదించాలనుకుందో కాని అనుపమ నిర్ణయాన్ని అందరు తప్పు పడుతున్నారు.