ప్రభాస్ అంటే ఇష్టం.. వదిలే ప్రసక్తే లేదు..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఏ హీరోయిన్ కు ఇష్టం ఉండదు చెప్పండి.. ఇక ప్రభాస్ తో నటించి మూడు సినిమాలను హిట్ అందుకున్న స్వీటీ అనుష్క అయితే ఓపెన్ గానే ప్రభాస్ అంటే తనకు ఎంతిష్టమో చెప్పేస్తుంది. ఇప్పటికే బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో కలిసి నటించిన ప్రభాస్, అనుష్కలు సూపర్ హిట్ పెయిర్ గా ప్రశంసలు అందుకున్నారు.

బాహుబలిలో అమరేంద్ర బాహుబలి, దేవసేనలుగా ఇద్దరి నటన మరోసారి ఫ్యాన్స్ ను అలరించింది. ఇక ఈ సినిమా విశేషాలను పంచుకుంటూ నేషనల్ మీడియాలో ప్రభాస్ తో మరిన్ని సినిమాలు చేస్తానని.. ప్రభాస్ ను ఇప్పుడప్పుడే వదిలే ప్రసక్తే లేదని అంటుంది అనుష్క. ప్రభాస్ తో సినిమా అంటే తాను ఏమి ఆలోచించకుండా ఓకే చెప్తానని అంటుంది. అంతలా ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడ్డదన్నమాట. ప్రస్తుతం అనుష్క భాగమతి సినిమాలో నటిస్తుండగా.. ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. అనుష్క ఆశపడుతున్నట్టుగా ప్రభాస్ తో ఎన్ని సినిమాలు చేస్తుందో చూడాలి.