
తెలుగు సినిమాకు నేషనల్ లెవల్ లో గుర్తింపు తెచ్చిన సినిమా షో. నీలకంఠ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో బాలీవుడ్ లో సైతం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు. ఆ తర్వాత మిస్సమ్మ అంటూ ఓ సినిమా తీసి హిట్ అందుకున్నా తర్వాత సినిమాలైతే తీస్తున్నాడు కాని హిట్ మాత్రం దక్కట్లేదు. నీలకంఠ తీసిన లాస్ట్ మూవీ 'మాయ' విమర్శకుల ప్రశంసలను అందుకున్నా కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు.
ఈ క్రమంలో తనకు మొదటి గుర్తింపు ఇచ్చిన షో సినిమానే సీక్వల్ గా తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు నీలకంఠ. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశాడట.. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ లో అవసరాల శ్రీనివాస్ కూడా భాగమవుతున్నాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రానుందట. ఈ సినిమా టైటిల్ గా సెకండ్ షో అని పెట్టబోతున్నారని సమాచారం. మరి షోతో తన ప్రతిభ చాటుకున్న నీలకంఠ ఆ మూవీకి సీక్వల్ గా వస్తున్న ఈ సెకండ్ షోతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.