
మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ సినిమా ఖైది నంబర్ 150 సంచలన విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. పదేళ్ల గ్యాప్ తర్వాత కూడా మెగా మేనియా ఏంటో చూపించిన ఆ సినిమా మెగాస్టార్ సత్తా ప్రూవ్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత మెగాస్టార్ 151వ సినిమాగా ఉయ్యాలవాడ నర సింహారెడ్డి బయోపిక్ తో సినిమా చేస్తున్నాడు.
సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అదేంటి సినిమా గురించి అఫిషియల్ స్టేట్మెంట్ కూడా రాలేదు మరి అప్పుడే సినిమా ఫస్ట్ లుక్ ఏంటి అంటే మెగా ఫ్యాన్స్ చేసిన ఫస్ట్ లుక్కే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. తమ మెగాస్టార్ మీద ఉన్న అభిమానాన్ని చూపిస్తూ ఓ హార్డ్ కోర్ ఫ్యాన్ ఉయ్యాలవాడ నర సింహారెడ్డి ఫస్ట్ లుక్ డిజైన్ చేసి వదిలాడు. చూస్తే సినిమా రియల్ ఫస్ట్ లుక్ లానే అనిపిస్తుంది. ఈ లుక్ తో చిత్రయూనిట్ మీద మరింత ప్రెజర్ పెరిగింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో మొదలు పెట్టనున్నారు.