
తన అందాల విందుతో యాంకరింగ్ కు కొత్త గ్లామర్ వచ్చేలా చేసిన అనసూయ యాక్సిడెంట్ కు దురైంది. బెంగళూరులో ఓ ప్రోగ్రాం చూసుకుని వస్తున్న ఆమె కార్ అనపురం జిల్లాలోని పెనుగొండ దగ్గర లారిని ఢీ కొట్టిందట. యాక్సిడెంట్ లో అనసూయ ఆడి కార్ బాగా డ్యామేజ్ అయ్యిందట. అనసూయకు కూడా దెబ్బలు తగిలినట్టు తెలుస్తుంది.
యాక్సిడెంట్ అవగానే దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో ఫస్ట్ ఎయిడ్ చేయించుకున్న అనసూయ ఆ తర్వాత సెపరేట్ ట్యాక్సీలో హైదరాబాద్ చేరుకుందట. జోష్ ఫుల్ యాంకరింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ ను ఆకట్టుకునే అనసూయ కార్ ప్రమాదానికి గురవడం బాధాకరమైన విషయం. అదృష్టవశాత్తు ఆమెకు పెద్దగా దెబ్బలేమి తగలకపోవడం విశేషం. అయినా సరే అనసూయ ఈ ఇన్సిడెంట్ తో షాక్ లో ఉందని తెలుస్తుంది.