చిరుతో ఐశ్వర్య రొమాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 తర్వాత చేస్తున్న సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ నిర్మిస్తున్న రెండో సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్రేజీ ప్రాజెక్ట్ గా మారింది. 150 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర కథగా రాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కు అవకాశం ఉందట.  

ఉయ్యాలవాడ నర సింహారెడ్డి మొదటి భార్య సిద్ధమ్మ.. ఈ పాత్రకు మొదట అనుష్క అనుకున్నారు కాని ఇప్పుడు ఆ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. తెలుగులో నాగార్జునతో స్పెషల్ సాంగ్ తప్ప కనీసం ఓ సినిమా కూడా డైరెక్ట్ గా చేయలేదు ఐశ్వర్య రాయ్. అందుకే ఈ సినిమాలో ఐశ్వర్య ఉంటే అదనపు ఆకర్షణగా ఉంటుందని ఆమెను తీసుకోవాలని చూస్తున్నరట. ప్రస్తుతం చిత్రయూనిట్ ఆమెను కలిసే పనిలో ఉన్నారట. మరి చిరుతో ఐశ్వర్య రొమాన్స్ ఉంటుందో లేదో మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది.