
సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రాజమండ్రి దగ్గర కొల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. జమిందారి అమ్మాయిగా కనిపించబోతున్న సమంత ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ లుక్ తో షాక్ ఇచ్చింది.
పంచె కట్టుతో అమ్మడి లుక్ అదరిపోయింది. రావు రమేష్ తో తను కూడా పంచె కట్టిన సమంత పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా వెళ్తుంది. ఓ సీన్ లో తండ్రిని ఆటపట్టించే క్రమంలో ఈ సన్నివేశం వస్తుందట. ఇక పంచెకట్టులో సమంత మాత్రం నిజంగానే ఆకట్టుకుంటుంది. ఇక సినిమా మొత్తం పల్లెటూరి నేపథ్యంలోనే నడుస్తుందని తెలుస్తుంది. ఈమధ్యనే ఈ సినిమాలో చరణ్ లుక్ రివీల్ అవగా మెగా ఫ్యాన్స్ వాటితో సినిమా మీద అంచనాలు పెంచేసుకున్నారు.