మరో క్రేజీ ఆఫర్ తో కీర్తి సురేష్..!

మలయాళ పరిశ్రమ నుండి తెలుగు తమిళ పరిశ్రమకు ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కీర్తి సురేష్. అందం అభినయంతో ఆకట్టుకున్న అమ్మడికి యూత్ ఆడియెన్స్ అందరు ఫిదా అయ్యిపోయారు. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఇమేజ్ సంపాదించిన కీర్తి సురేష్ టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడాలేకుండా వరుస ఆఫర్లతో ఫుల్ ఫాంలో ఉంది.

తెలుగులో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఛాన్స్ పట్టేసిన కీర్తి సురేష్ ఇప్పుడు మరో ఆఫర్ చేజిక్కించుకుంది. చియాన్ విక్రం సింగం హరి డైరక్షన్ క్రేజీ కాంబినేషన్ లో సామి సీక్వల్ గా ఓ సినిమా రూపొందించబడుతుంది. ఈ సినిమాలో త్రిష ఒక హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కూడా ఛాన్స్ దక్కించుకుందట. ఇప్పటికే కోలీవుడ్ లో ఇళయదళపతి విజయ్ తో నటించిన కీర్తి ఇప్పుడు విక్రం ఛాన్స్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లింది.