ప్రముఖ టీవి సీరియల్ ఆర్టిస్ట్ ఆత్మహత్య

ప్రముఖ టీవి సీరియల్ నటుడు ప్రదీప్ కుమార్ ఈరోజు ఆత్మహత్య చేసుకొన్నాడు. హైదరాబాద్ నగరంలోని పుష్పాలగూడలో గ్రీన్ హోమ్స్ అపార్ట్ మెంటులో అయన తన భార్య పావని రెడ్డితో కలిసి నివసిస్తున్నాడు. ఆమె కూడా టీవి సీరియల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ఇంట్లో లేని సమయంలో ప్రదీప్ కుమార్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ సంగతి తెలుస్కోని పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. 

ప్రదీప్ కుమార్ సప్త మాత్రిక, ఆరుగురు పతివ్రతలు వంటి అనేక సీరియల్స్ తో బాటు కొన్ని సినిమాలలో కూడా నటించాడు. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరూ అనేక టీవి సీరియల్స్ చేస్తూ చాలా బిజీగానే ఉన్నారు. కనుక వారి ఆర్ధిక పరిస్థితి కూడా బాగానే ఉంది. మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకొని ఉజ్వల భవిష్యత్ ఉన్న ప్రదీప్ కుమార్ ఆత్మహత్య ఎందుకు చేసుకొన్నాడో ఇంకా కారణాలు తెలియవలసి ఉంది. బహుశః కుటుంబ కలహాల కారణంగానే ప్రదీప్ కుమార్ ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.