ప్రభాస్ గురించి రానా ఏం చెప్పాడంటే..!

బాహుబలి సినిమాకు మూల స్థంబాలైన ప్రభాస్ రానాలు ఇద్దరు హీరోలే.. టైటిల్ రోల్ పోశించిన ప్రభాస్ మాత్రమే కాదు ప్రతి నాయకుడిగా రానా దగ్గుబాటి కూడా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. బాహుబలి ఈ రేంజ్ లో వెళ్లడానికి ఒక కారణం రానా అని కూడా చెప్పొచ్చు. ఇక బాహుబలి బిగినింగ్, కన్ క్లూజన్ రెండు సినిమాలు తనతో నటించిన సహ నటుడు ప్రభాస్ గురించి రానా మనసులో మాట బయటపెట్టాడు. 


నా కోస్టార్.. ఫ్రెండ్.. బాహుబలి అయిన ప్రభాస్ జెంటిల్మన్. కెరియర్ పీక్స్ లో ఉన్న 5 సంవత్సరాలు తాను ఒకే సినిమా కోసం నిలబడటం గొప్ప విషయం.. నవ్వుతూ దేని గురించి ప్రశ్నించకుండా ఉన్నాడు ప్రభాస్. అందుకే ఇప్పుడతను పాన్ ఇండియా సూపర్ స్టార్ గా నిలబడ్డాడు. తన ఈ ప్రయాణంలో తాను కూడా భాగమయ్యినందుకు సంతోషిస్తున్నానంటూ సాహోరే బాహుబలి అని ఇన్ స్టాగ్రాంలో ప్రభాస్ బాహుబలి పిక్ పెట్టి మెసేజ్ పెట్టాడు రానా. 

సాధారణంగా ఓ హీరోకి వస్తున్న క్రేజ్ ను చూసి సహ నటుడిగా రానా కాస్తైనా రాగ ద్వేషాలు పెంచుకుంటాడని అనుకున్నారు. కాని రానా పెట్టిన ఈ మెసేజ్ చూస్తే మనస్పూర్తిగా అతన్ని అభినందించాల్సిందే.