విశ్వరూపం-2 ఫస్ట్ లుక్ పోస్టర్..!

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విశ్వరూపం సినిమమ గుర్తుండే ఉంటుంది. ఓ హాలీవుడ్ సినిమా రేంజ్ లో స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వరూపంలో కమల్ తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఎన్నో వివాదాలతో వచ్చిన ఆ సినిమా ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసింది. ఇక విశ్వరూపం ఎండింగ్ లో విశ్వరూపం-2 కూడా ఉంటుందని అన్నారు.


ఆల్రెడీ సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్న ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. నిర్మాతలు చేతులెత్తేయడంతో ఆ ప్రాజెక్ట్ ఆపేశాడు కమల్ హాసన్. ఇక ఇప్పుడు తన నిర్మాణంలోనే విశ్వరూపం-2 చేస్తున్నాడు. ఇక నిన్న సాయంత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు కమల్ హాసన్. ముఖం మీద దెబ్బలతో సూట్ వేసుకుని కనిపిస్తున్న కమల్ హాసన్ జాతీయ జెండాను గుండెకు హత్తుకుని ఉన్న ఈ పోస్టర్ సిని ప్రియులను అలరిస్తుంది. తప్పకుండా సినిమా మరో సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేస్తారట.