నాని జెంటిల్ మ్యాన్ ట్రైలర్ టాక్

తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ యూత్ లో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నాని, మొన్నటి క్రిష్ణగాడి వీర ప్రేమ గాధ సినిమాతో అలరించి ఇప్పుడు జెంటిల్ మ్యాన్ గా రాబోతున్నాడు. పాటలు అప్పుడే మార్కెట్లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొల్పుతుంది. నాని తో గతంలో అష్టాచెమ్మ చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణే ఈ కొత్త సినిమాకి కూడా దర్శకుడు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రొమాన్స్ కూడా దట్టించి వడ్డించిన సినిమా జెంటిల్ మ్యాన్ అని ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికైనా అర్ధమవుతుంది.

రొమాన్స్ తో మొదలయ్యే ట్రైలర్, థ్రిల్లర్ ఎలెమెంట్స్ తో ముందుకు సాగుతుంది. సురభి, నివేదిత థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి, చాలా కాలం తర్వాత సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించడం విశేషం.