సంపూ వైరస్ టీజర్ ఎటాక్..!

బర్నింగ్ స్టార్ గా తనకు తానుగా బర్న్ అవుతూ హృదయ కాలయంతో హీరోగా పరిచయమైన హీరో సంపూర్ణేష్ బాబు. కొద్దికాలంగా అతని సోలో సినిమాలు మిస్ అయిన ఆడియెన్స్ కు మళ్లీ తను నటించిన సినిమాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే సంపూ నటించిన కొబ్బరిమట్ట రిలీజ్ కు రెడీ అవుతుండగా ఇప్పుడు వైరస్ అనే సినిమా కూడా రాబోతుంది.

ఎస్.ఆర్ కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. మనిషిలో భయముంటుంది అంటూ సంపూర్ణేష్ చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన టీజర్ తన భయకరమైన డైలాగ్ తో ముగుస్తుంది. కామెడీ పండిస్తూ కితకితలు పెట్టించేలా కాకుండా ఓ స్టార్ హీరో ఇమేజ్ డైలాగులతో వస్తున్న ఈ వైరస్ ప్రేక్షకులను అలరిస్తాడేమో చూడాలి.