బాహుబలికి పోటీగా చిన్న సినిమా..!

ప్రపంచ దేశాలకు తెలుగు సినిమా స్టామినాను తెలియచేస్తున్న బాహుబలి-2 ప్రభంజనం ముందు ఏ సినిమా నిలబడటం లేదు. రిలీజ్ అయిన 3 రోజుల్లోనే 300 కోట్ల కలక్షన్స్ రాబట్టిన బాహుబలి కన్ క్లూజన్ ఫుల్ రన్ లో అనుకున్నట్టుగా 1000 కోట్ల కలక్షన్స్ వసూళు చేస్తుందని అంచనాలేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాదు ఈ సినిమాకు పోటీగా మరే సినిమా విడుదల చేయాలని అనుకోవట్లేదు.

మిగతా భాషల వారి పరిస్థితి ఇదే.. కాని తెలుగులో మాత్రం మే 5న బాహుబలి-2కి పోటీగా బాబు బాగా బిజీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ అడల్ట్ కంటెంట్ మూవీ హంటర్ రీమేక్ గా అవసరాల శ్రీనివాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో తేజశ్వి, కీర్తన, మిస్తి చక్రవర్తితో పాటుగా శ్రీముఖి కూడా నటిస్తుంది. అడల్ట్ డోస్ ఎక్కువైనట్టు కనిపిస్తున్న ఈ సినిమా యూత్ టార్గెట్ తో వస్తుంది. ఓ పక్క బాహుబలి-2 ఓ రేంజ్ కలక్షన్స్ తో దూసుకెళ్తుంటే అవేమి పట్టించుకోకుండా బాబు బాగా బిజీ సినిమాను రిలీజ్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి బాహుబలి సునామి ఎదుట బాబు నిలబడగలుగుతాడో లేడో చూడాలి.