
ఎవరైనా ప్రెస్టిజియస్ సినిమాలో నటించి ఆ సినిమా రిలీజ్ కు ముందు ఫలితం ఎలా ఉంటుందో అని టెన్షన్ పడతారు. కాని రిలీజ్ తర్వాత భయంకరమైన హిట్ అందుకున్న తర్వాత కూడా నిద్రపట్టకపోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇంతకీ సినిమా రిలీజ్ తర్వాత నిద్రపట్టని హీరో ఎవరు అంటే ఇంకెవరు మన అమరేంద్ర బాహుబలి అలియాస్ ప్రభాస్ అని తెలుస్తుంది. రాజమౌళి బాహుబలి కథను ఏముహుర్తాన ప్రభాస్ కు వినిపించాడో కాని ఆ సినిమా కోసం ఐదేళ్లు కష్టపడటమే కాదు తెలుగు సినిమాను తారాస్థాయిలో నిలబెట్టే సినిమా తనది చేసుకున్నాడు ప్రభాస్.
ఇక సినిమా రిలీజ్ కు ముందు కాస్త టెన్షన్ ఉన్నా రిలీజ్ తర్వాత నుండి తనకు వస్తున్న ఫోన్లు, మెసేజులకు రిప్లై ఇవ్వలేక తనకు నిద్రపట్టడం లేదని అంటున్నాడు ప్రభాస్. అమరేంద్ర బాహుబలిగా, మహింద్ర బాహుబలిగా ప్రభాస్ చూపించిన అభినయం కచ్చితంగా మెచ్చుకోదగినదే. సినిమా చూసిన సన్నిహితులు స్నేహితులు తెలిసినవారు అంతా ప్రభాస్ కు ఫోన్ చేసి మరి విష్ చేస్తున్నారట. రిలీజ్ అయిన దగ్గరనుండి రాత్రిళ్లు నిద్రకూడా పోకుండా వారికి సమాధానం ఇస్తున్నాడట ప్రభాస్.