
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంత అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది పవన్ కళ్యాణ్ ను చూసే చెప్పొచ్చు. తనకున్న క్రేజ్ దృష్టిలో ఉంచుకుని తలపొగరుగా ఉండకుండా డౌన్ టూ ఎర్త్ గా ఉంటాడని పవన్ గురించి అందరు అంటుంటారు. ఇప్పుడు అదే వినయాన్ని మరోసారి ప్రదర్శించి ఓ హీరోయిన్ మెప్పు పొందాడు పవన్ కళ్యాణ్.
త్రివిక్రం దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ టైంలో ఇష్టమైన ఫుడ్ గురించి సరదాగా చెప్పడంతో దాన్ని గుర్తుపెట్టుకుని మరి రీసెంట్ గా ఓరోజు సర్ ప్రైజ్ గా ఆమెకు ఇష్టమైన అప్పం గిఫ్ట్ గా ఇచ్చాడట పవన్. తన భోజనంలో అప్పం (మనదగ్గర అట్లుగా పిలవబడే తిను పదార్ధం) చూసే సరికి షాక్ అయ్యిందట అను. ఇది పవన్ గిఫ్ట్ అని తెలిసి తను ఎంతో సంతోషించిందట. ఇదే విషయాన్ని బయటపెట్టి అమ్మడు పవన్ ను తెగ పొగిడేస్తుంది.