అనుష్క ఫ్యూచర్ ఏంటో..!

తెలుగులో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాణం పోసిన హీరోయిన్ అనుష్క. ఓ పక్క రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రయోగాత్మక సినిమాలను చేసుకుంటూ వచ్చింది. ఇక సైజ్ జీరో కోసం అంత రిస్క్ తీసుకుని లావెక్కినా లాభం లేకపోగా పెరిగిన ఆ సైజే తనకు శాపంగా మారింది. నటించిన సినిమాలన్నిటిలో లావుగా కనిపించిన అనుష్క వాటి ఫలితాలతో కూడా అంత సాటిస్ఫైగా లేదు.   

ఇక తనని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిన సినిమా బాహుబలి కన్ క్లూజన్. దేవసేనగా అనుష్క కనబరచిన అభినయం అందరిని మెప్పించింది. మధ్య మధ్యలో లావెక్కిన సన్నివేశాలు వచ్చినా వాటిని తెలివిగా కవర్ చేశాడు రాజమౌళి. అయితే సినిమా సక్సెస్ అయ్యి హిట్ ఖాతాలో పడినా సరే అనుష్క ఎందుకో తన దగ్గరున్న స్టాఫ్ అందరిని పీకేసిందట. మేనేజర్ తో సహా అందరిని తీసేసిన అనుష్క ఫ్యూచర్ ఏంటో అని అందరు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఓన్ బ్యానర్ గా పేరున్న యువి క్రియేషన్స్ లో భాగమతి సినిమా చేస్తుంది అనుష్క. మరి ఆ సినిమా తర్వాత పెళ్లి చేసుకునే ఆలోచనతోనే స్టాఫ్ అందరిని తీసేసిందని అంటున్నారు. ఆ వార్త ఎంతవతకు నిజమో తెలియదు కాని అనుష్క సినిమాలను ఆపేస్తుంది అన్న వార్త మాత్రం తన ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేస్తుంది.