బాహుబలి-2 ఫస్ట్ డే కలక్షన్స్..!

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన బాహుబలి కన్ క్లూజన్ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. ప్రభాస్ ధీరత్వం, రాజమౌళి దర్శకత్వ ప్రతిభ కలిసి మరోసారి బాహుబలిని తారాస్థాయిలో నిలబెట్టాయి. దాదాపు 6500 సెంటర్స్ లో రిలీజ్ అయిన బాహుబలి-2 మొదటి రోజు ఎంత వసూలు చేసింది అన్న దాని మీద అందరి దృష్టి ఉంది.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అనుకున్న దానికన్నా భారీ రేంజ్ లోనే బాహుబలి-2 కలక్షన్స్ వచ్చాయని అంటున్నారు. కచ్చితంగా 120 కోట్ల దాకా ఫస్ట్ డే వసూళ్లు ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం ఏపి, తెలంగాణాలో అయితే 43.26 కోట్ల కలక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది. నైజాం 8.9 కోట్లు, సీడెడ్ 6.35 కోట్లు, ఉత్తరాంధ్ర 4.5 కోట్లు, ఈస్ట్ 5.94 కోట్లు, వెస్ట్ 6.08 కోట్లు, క్రిష్ణా 2.82 కోట్లు, గుంటూర్ 6.18 కోట్లు, నెల్లోర్ 2.1 కోట్లు కలక్షన్స్ వచ్చాయి. ఇక టోటల్ కలక్షన్స్ 43.26 కోట్లు వచ్చాయి. ఇవి కేవలం తెలుగు రాష్ట్రాల కలక్షన్స్ మాత్రమే మిగతావి ఇంకా తెలియాల్సి ఉంది.