
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబి డైరక్షన్ లో జై లవ కుశ సినిమా చేస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగష్టు ఎండింగ్ కల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్నాళ్ల నుండో క్రేజీ కాంబినేషన్ గా అనుకుంటున్న త్రివిక్రం తారక్ కాంబోలో మూవీ ఉంటుందని అంటున్నారు.
ఈ సినిమా గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కాని మూవీ ఎప్పుడు ఏంటి అన్నది మాత్రం చెప్పలేదు. ఓ పక్క త్రివిక్రం పవన్ కళ్యాణ్ మూవీని ఈమధ్యనే స్టార్ట్ చేశాడు. అది పూర్తయితే గాని ఎన్.టి.ఆర్ సినిమా ఎప్పుడు అన్నది చెప్పలేం. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు కాని ఈ సినిమాలో హీరోయిన్ గా మాత్రం మెహెరిన్ కౌర్ ను తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కృష్ణగాడి వీర ప్రేమగాథతో తెలుగు తెరకు పరిచయమైన మెహెరిన్ కౌర్ తన అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ తో ఛాన్స్ అనగానే అమ్మడిని చూసి అందరు స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు ఇదే మంచి అవకాశం అని అంటున్నారు. ఈ లక్కీ ఛాన్స్ కనుక మెహెరిన్ సొంతమైతే టాలీవుడ్ లో మరిన్ని క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకునే ఛాన్స్ దొరికినట్టే.