
మిల్కీ బ్యూటీ తమన్నానేమో బాహుబలి పార్ట్ 1లో లానే పార్ట్ 2లో కూడా తనకు ఇంపార్టెంట్ పాత్ర దక్కిందని ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. తీరా ఈరోజు రిలీజ్ అయిన సినిమా చూస్తే ఏదో సైడ్ ఆర్టిస్ట్ లా ఆమెను ఉంచారు. అది కూడా లాస్ట్ ఫైట్ లోనే తమన్నా కనబడ్డది.
తెలుగులో స్టార్ హీరోయిన్ రేంజ్ ఉన్న తమన్నాకు ఇంతకంటే అవమానం ఏదైనా ఉంటుందా అంటూ ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. అవంతిక పాత్రలో బాహుబలి బిగినింగ్ లో ఎన్నో అంచనాలను క్రియేట్ చేసిన తమన్నా పార్ట్ 2లో కూడా తన పాత్రకు ప్రాముఖ్యత ఉందని చెప్పింది. కాని చెప్పినట్టుగా ఆమె లేదు కదా చివర్లో ఏదో అలా కనిపించింది.
ఓవిధంగా తమన్నాకు రాజమౌళి అన్యాయం చేశాడని అంటున్నారు. కథలో అంత ఇన్వాల్వ్ అయ్యే పాత్ర కాదు కాబట్టి ఆమె పాత్ర ఉన్నంత వరకు రిచ్ గానే చేశారు. మొదటి పార్ట్ లో గ్లామర్ నింపిన తమన్నా సెకండ్ పార్ట్ లో కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా చేసినందుకు ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.
బాహుబలి తన కెరియర్ లో ఓ గొప్ప సినిమా అంటూ ప్రత్యేకంగా చెప్పుకొచ్చిన తమన్నా సెకండ్ పార్ట్ లో తన క్యారక్టర్ ఏమాత్రం లేదన్న విషయంపై ఎలా స్పందిస్తుందో కాని ఓ స్టార్ హీరోయిన్ గా కాకుండా మంచి సినిమాలో భాగమైనందుకు తమన్నా గొప్పగా ఫీల్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి బాహుబలి కన్ క్లూజన్ కూడా ఆడియెన్స్ ముందుకొచ్చి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.