
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నటిస్తున్న సినిమా సాహో.. మిర్చి తర్వాత కెరియర్ లో ఐదేళ్లు బాహుబలికి అంకితం చేసిన ప్రభాస్ ఈ ఐదేళ్లలో కేవలం రెండు సినిమాలే చేశాడు. బాహుబలి-2 షూటింగ్ పూర్తి కాగానే వెంటనే తన తర్వాత సినిమా సుజిత్ డైరక్షన్ లో చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న సాహో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
బాహుబలితో నేషనల్ వైడ్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా కూడా తెలుగు తమిళ మలయాళ హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. రీసెంట్ గా టైటిల్ లోగో రిలీజ్ చేసిన చిత్రయూనిట్ కొద్ది నిమిషాల క్రితం ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. 30 సెకన్ల నిడివి గల ఈ టీజర్ లో ఒకే ఒక్క డైలాగ్ తో టీజర్ అదరగొట్టాడు ప్రభాస్. రేపు బాహుబలి-2 రిలీజ్ అవుతున్న సందర్భంగా ఒక్కరోజు ముందే సాహో టీజర్ రిలీజ్ చేశారు. బాహుబలి-2 ప్రదర్శించబడే థియేటర్లో కూడా బ్రేక్ టైంలో ఈ టీజర్ వస్తుందట.
సినిమాలో ఎయిర్ ఫైట్ క్రేజీగా ఉంటుందట. టీజర్ చివరలో అది కూడా చూపించి సినిమా రేంజ్ ఏంటో తెలియచేశాడు డైరక్టర్ సుజిత్. మరి బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా సాహో ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.