ఐదేళ్లంటే బాహుబలిని చేసేవాడిని కాదు : రాజమౌళి

బాహుబలి అంత గొప్ప సినిమా తీసిన రాజమౌళి ఈ సినిమా రెండు పార్టులకు కలిసి ఐదేళ్ల టైం తీసుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఐదేళ్లు పడుతుందని ముందే తెలిస్తే కచ్చితంగా తాను చేసే వాడిని కాదని అన్నాడు రాజమౌళి. రెండు సంవత్సరాల్లో ఓ భారీ సినిమా చేయాలని అనుకున్నాం కాని మొదటి పార్ట్ వరకు రిలీజ్ చేయల్సి వచ్చింది.

ఇక ఆ పార్ట్ 150 నుండి 200 కోట్లు వసూళ్లు చేస్తుంది అనుకుంటే ఊహించని రేంజ్ లో కలక్షన్స్ తెచ్చింది. ఈ క్రమంలో బాహుబలి-2 కు అంత క్రేజ్ ఏర్పడింది. అసలు ఇంత టైం పడుతుందని ముందే తెలిస్తే మాత్రం తాను బాహుబలి తీసుండే వాడిని కాదని అంటూ షాక్ ఇచ్చాడు రాజమౌళి. తెలుగు సినిమా స్థాయిని పెంచి తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేసిన బాహుబలి సినిమా రాజమౌళి చేయకుండా ఉంటే ఛ ఆ ఆలోచనే అసలు బాలేదు కదా.. సిని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న బాహుబలి 2 రేపు ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతుంది.