బాహుబలి-2 ఇంటర్వల్ లీక్..!

రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న బాహుబలి-2 సినిమా ఇంటర్వల్ సీన్స్ సోషల్ మీడియాలో లీక్ అవడం సంచలనంగా మారింది. ఈ వీడియో తమిళ భాషలో ఉండటం విశేషం. కోలీవుడ్ బాహుబలి-2 సెన్సార్ టైంలో ఈ వీడియో లీక్ చేసి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ లో కాదు తెలుగులో కూడా ఈ వీడియో వాట్స్ అప్ లో షేర్ చేస్తున్నారట. 

లీక్ వీడియో అంత క్వాలిటీ లేకపోవడం ఒకటి లీక్ అయిన వీడియో కూడా తక్కువ నిడివితో ఉండటం వల్ల చిత్రయూనిట్ దీని గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు. లీక్ అయిన సీన్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. బాహుబలి బిగినింగ్ కన్నా బాహుబలి-2 మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయమని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. మరి వారి అంచనాలను పార్ట్-2 అందుకుంటుందో లేదో తెలియాలంటే ఒక్కరోజు వెయిట్ చేస్తే సరిపోతుంది.