
మాన్లీ స్టార్ గా మాస్ ఇమేజ్ సంపాదించిన గోపిచంద్ ఈమధ్య కాస్త ట్రాక్ తప్పాడని తెలిసిందే. సౌఖ్యం తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో గోపిచంద్ చేస్తున్న సినిమా గౌతం నంద. సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో గోపిచంద్ డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. రిలీజ్ అయిన పోస్టర్స్ లో గోపిచంద్ చాలా స్టైలిష్ లుక్ లో కనబడుతున్నాడు.
షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన ఈ సినిమా త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. గోపిచంద్ తో కేథరిన్ త్రెస హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న గౌతం నంద మూవీ గోపిచంద్ కెరియర్ కు మంచి బూస్టప్ ఇస్తుందేమో చూడాలి