
రాజ్ తరుణ్ హీరోగా వెలిగొండ శ్రీనివా డైరక్షన్ లో వస్తున్న సినిమా అంధగాడు. రాజ్ తరుణ్ డిఫరెంట్ గా బ్లైండ్ క్యారక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాలో హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అనీల్ సుంకర ఈ సినిమాను నిరిస్తున్నారు. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది.
కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ తరుణ్ మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు. గుడ్డివాని పాత్రలో కామెడీని పంచుతూ టీజర్ అయితే మెప్పించాడు. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేయనున్నారు. రచయితగా సక్సెస్ అయిన వెలిగొండ శ్రీనివాస్ దర్శకుడిగా చేస్తున్న మొదటి ప్రయత్నం అంధగాడు. రాజ్ తరుణ్ అన్ని సినిమాల్లానే ఈ అంధగాడు కూడా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెబుతున్నారు.