
ప్రస్తుతం ఐపిఎల్ సీజన్లో క్రీడా అభిమానులందరు సాయంత్రం అయితే టివిలకు అతుక్కుపోతుంటే ఈ టైంలోనే బాహుబలి-2 ర్లీజ్ అవుతుంది. రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తారాస్థాయిలో చేరుకున్నాయి. ఏకంగా ఐపిఎల్ లో కూడా బాహుబలి యాడ్ రావడం విశేషం. ఇందంతా బాహుబలి హింది నిర్మాత కరణ్ జోహార్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని తెలుస్తుంది.
ప్రపంచమంతా చూసే ఈ మ్యాచుల్లో బాహుబలి-2 యాడ్ రావడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఈ సినిమా 1000 కోట్ల కలక్షన్స్ రాబట్టాలనే ఆలోచనలో ఉంది. ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల దాకా జరిగిందని టాక్. మరి సినిమా కలక్షన్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి.