రాజమౌళి తప్ప అందరు సీరియల్ డైరక్టర్లే ..!

ఏవిషయం మీద అయినా డిఫరెంట్ గా స్పందించే ఆర్జివి ప్రస్తుతం రిలీజ్ కాబోతున్న బాహుబలి-2 గురించి కామెంట్స్ చేశాడు. బాహుబలి-2 చూశాక దేశంలో మిగతా దర్శకులంతా టివి సీరియల్ దర్శకులమని అనుకుంటారని అని ట్వీట్ చేశాడు వర్మ. ఈ ట్వీట్ తో మరోసారి రాజమౌళిని టార్గెట్ చేశాడు వర్మ. బాహుబలి-2 మీద పెరుగుతున్న అంచనాలు రిలీజ్ చేసిన ట్రైలర్ టీజర్ లను చూసి బహుశా వర్మ ఇలా ట్వీట్ చేసి ఉంటాడని అనుకుంటున్నారు.


అందరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందని ఉండాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయి సినిమాగా తీర్చిదిద్దిన రాజమౌళి తప్పకుండా బాహుబలి-2 తో మరిన్ని ప్రశంసలు అందుకుంటాడని చెప్పొచ్చు. సినిమా కోసం ఐదేళ్లు అలుపెరగని యోధునిగా కష్టపడిన జక్కన్న తెలుగు దర్శకుల సత్తా ఏంటో చూపించాడు.