
ప్రస్తుతం అందరి నోటా బాహుబలి-2 గురించే.. వేలం వెర్రిగా ఈ సినిమా చూడాలని ప్రేక్షకులు ఎగబడుతున్నారు. సినిమా మీద ఉన్న ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో నకిలి టికెట్లను విక్రయిస్తున్నారట. హైదరాబాద్ తో పాటుగా అమెరికా ఇంగ్లాండ్ లోని కొన్ని థియేటర్స్ యొక్క సీట్ నెంబర్స్ తో సహా టికెట్లు అమ్మకానికి పెట్టారట. టికెట్ ధర 120 రూపాయల్ చొప్పున టికెట్స్ భారీగా కొనేశారట. తీరా చూస్తే అసలు ఆ వెబ్ సైట్ ఫేక్ అని తేలింది.
కొయంబత్తూర్ నుండి www.newtickets.in సైట్ మెయింటైన్ చేశారట. ఏప్రిల్ 7న ఈ సైట్ ప్రారంభించారట. బాహుబలి-2 మీద ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే ఆలోచనతో జనాలను మోసం చేసి ఇలా డబ్బులు కాజేశారట. పేయూమనితో ఈ సైట్ వాళ్లు ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ టికెట్స్ అన్ని ఫేక్ అని పోలీసులు నిర్ణయించారు. ఇలాంటివాటి వల్ల మోసపోవద్దని పోలీసులు నెటిజెన్లకు చెప్పారు.