
రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం నేషనల్ అవార్డ్ ప్రకటించగా ఉత్తమ నటుడిగా అక్షయ్ కుమార్ అవార్డ్ అందుకున్నారు. లాస్ట్ ఇయర్ రుస్తుం సినిమాకు గాను అక్షయ్ కుమార్ ఈ అవార్డ్ కైవసం చేసుకున్నారు. నేషనల్ అవార్డ్ విషయంపై జరుగుతున్న రగడ గురించి తెలుసుకున్న అక్షయ్ కుమార్ తాను ఈ అవార్డ్ పొందడానికి 26 సంవత్సరాల కష్టం ఉందని.. ఒకవేళ అవార్డుకు తాను అనర్హుడను అని అంటే అవార్డ్ ను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధమే అంటూ హాట్ కామెంట్స్ చేశాడు అక్షయ్ కుమార్.
జ్యూరీ టీంలో ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ కు సపోర్ట్ గా నిలిచాడని సౌత్ దర్శకులే కాదు బాలీవుడ్ లో కొంతమంది కూడా విమర్శలు చేశారు. కోలీవుడ్ డైరక్టర్ మురుగదాస్ అయితే ప్రియదర్శన్ తో డైరెక్ట్ గా గొడవ పడిన విషయం తెలిసిందే. అక్షయ్ కుమార్ చేసిన కామెంట్లకు ఎవరు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.