
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ స్పైడర్. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై నెగటివ్ టాక్ రావడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ న్యూస్ అయ్యింది. సినిమా గురించి ఇన్నాళ్లు సస్పెన్స్ గా ఉంచిన యూనిట్ రిలీజ్ విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుందట. డైరక్టర్ మురుగదాస్ జూన్ 23న స్పైడర్ రిలీఎజ్ ఫిక్స్ చేసినా క్లైమాక్స్ రీ షూట్స్ వల్ల అనుకున్న టైం కు రాలేకపోతుందని అంటున్నారు.
జూన్ లో అనుకున్న సినిమా జూలై లో కూడా కాకుండా ఆగష్టుకి పోస్ట్ పోన్ చేశారట. ఆగష్టు చివరి వారంలో స్పైడర్ రిలీజ్ చేద్దామని అనుకోగా ఇప్పుడు మళ్లీ దసరా బరిలో సినిమాను దించేయాలని చూస్తున్నారట. ఓ పక్క దసరాకి టాలీవుడ్ లో ఉండే సినిమాల పోటీ తెలిసిందే.. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి డైరక్షన్ లో జై లవ కుశ దసరా టార్గెట్ తో వస్తుంది. మరి ఈ రెండు సినిమాల మధ్య ఫైట్ తప్పదని అనిపిస్తుంది.