
కళాతపస్వి కె.విశ్వనాధ్ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై సిని ప్రముఖులంతా విశ్వనాధ్ గారికి తమ అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ వెరైటీగా స్పందించాడు. తాను దాదా సాహేబ్ సినిమాలు విశ్వనాధ్ సినిమాలు చూశానని.. తన ఉద్దేశం ప్రకారం ఫాల్కేకే విశ్వనాధ్ అవార్డ్ ఇవ్వాలని అన్నాడు.
విశ్వనాధ్ గారు తీసిన శంకరాభరణం ఒక్కటి చాలు ఆయన రేంజ్ ఏంటో చెప్పడానికి.. అలాంటి విశ్వనాధ్ గారికి ఫాల్కే అవార్డ్ ఇవ్వడం ఏంటని చమత్కరించాడు. కావాలంటే రాజు హిర్వాణి అవార్డనో.. లేక కరణ్ జోహార్ అవార్డనో ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ఫాల్కే ను కొలుస్తారు. అలాంటి అవార్డ్ విశ్వనాధ్ గారికి రావడం పట్ల వర్మ స్పందించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విషయం ఏదైనా ఆర్జివి స్పందన వెరైటీగా ఉంటుంది కాబట్టి వర్మ ట్వీట్స్ ను లైట్ తీసుకుంటున్న వారు కొందరైతే అతనికి వంత పాడే వారు కొందరున్నారు.