బాబాయ్ కు అబ్బాయ్ సపోర్ట్..!

మెగా స్టార్ తనయుడిగా రాం చరణ్ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్నాడు. ధ్రువతో సూపర్ హిట్ అందుకున్న చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రయూనిట్ కు అభిమానుల తాకిడి ఎక్కువైంది. చరణ్ ను కలిసేందుకు వేలకొద్ది ఫ్యాన్స్ అక్కడ హంగామా చేస్తున్నారట. ఇక వచ్చిన ఫ్యాన్స్ తో ఉత్సాహంగా మాట్లాడిన చరణ్. మాటల సందర్భంలో బాబాయ్ రాజకీయాల గురించి కూడా ప్రస్థావించాడట.

బాబాయ్ కు సపోర్ట్ గా నిలవాలని మెగా ఫ్యాన్స్ కు తన తరపున చెప్పాడు చరణ్. మీరందరు బాబాయ్ కు అండగా ఉండండి.. రాజకీయాల్లో అయినా సరే మరెందులో అయినా సరే అంటూ బాబాయ్ కు తన మద్ధతునిచ్చాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో చెర్రి కూడా పవన్ కు సపోర్ట్ ఉండటం విశేషం. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు పవన్ జనసేనకు తన మద్ధతు ప్రకటించారు.