కళాతపస్వికు దాదా సాహేబ్ పాల్కే..!

ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్ కు అత్యంత ప్రతిష్టాత్మకం దాదా సాహేబ్ పాల్కే అవార్డ్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ విషయం ప్రకటించారు. తెలుగు తెర మీద కళాత్మక సినిమాలతో ప్రేక్షక హృదయాల్లో చెరిపోని ముద్ర వేసుకున్న కళాతపశ్వి ఎన్నో అద్భుత కళఖండాలను ప్రేక్షకులకు అందించారు.  

సీతామాలక్ష్మి నుండి సప్తపది, సిరిసిరిమువ్వ తో పాటుగా సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, సూత్రధారులు, శంకరాభరణం, స్వర్ణకమలం, శృతిలయలు, శుభసంకల్పం, స్వయంకృషి లాంటి ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు విశ్వనాధ్. ఈ సినిమాలకు గుర్తుగా 2016 సంవత్సరానికి గాను దాదా సాహేబ్ పాల్కే అవార్డ్ అందివ్వనున్నారు. మే 3న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోనున్నారు కే.విశ్వనాధ్.