
బాహుబలి ఫీవర్ తో కేవలం నాలుగు షోలు అయితే కష్టమే అనుకున్నారు కావొచ్చు. అందుకే ప్రేక్షకుల సౌకర్యార్ధం రెండు షోలను పెంచి ఏకంగా రోజుకి 6 షోలతో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఏప్రిల్ 28న రిలీజ్ అవుతున్న బాహుబలి-2 కోసం ఓ వారం పాటు ఏపిలో 6 షోలు, తెలంగాణాలో 5 షోలకు పర్మిషన్ ఇచ్చేశారు. సినిమా మీద ఏర్పడ్డ అంచనాలతో పాటుగా కలక్షన్స్ కూడా భారీగా రాబట్టే క్రమంలో చిత్ర నిర్మాతలు రెండు ప్రభుత్వాల నుండి ఈ విధమైన పర్మిషన్స్ తెచ్చుకునారు.
సినిమా రిలీజ్ అయిన పది రోజుల దాకా ఈ అదనపు ఆటలు ప్రదర్శించబడతాయి. ట్రైలర్ తో పార్ట్ 2 మీద ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి సాహోరె సాంగ్ తో సినిమా మొదటి ఆటే చూసేయాలి అన్నంత ఉత్సాహాన్ని నింపాడు. ఈ అదనపు షోలు సినిమాకు తప్పకుండా రికార్డ్ కలక్షన్స్ తెచ్చిపెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. టికెట్ రేటు కూడా పెంచుతున్నారు కాబట్టి టార్గెట్ పెట్టుకున్న 1000 కోట్ల కలక్షన్స్ కన్ఫాం గా రాబట్టే అవకాశాలే ఉన్నాయని అంటున్నారు.