
అవతార్ సినిమా సృష్టించిన సంచలనం అందరికి తెలిసిందే. ప్రపంచ సిని ప్రియులను ఔరా అనేలా చేసిన అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరున్ ఆ సినిమా సీక్వల్ ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రస్తుతం అవతార్-2 ను తెరకెక్కిస్తున్న జేమ్స్ ఆ సినిమాను 2020 కల్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా చూస్తున్నారు. ఇక అవతార్-3,4-5 కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు జేమ్స్ కామెరున్.
అవతార్ 3 డిసెంబర్ 17, 2021.. అవతార్ 4 డిసెంబర్ 20, 2024, అవతార్-5 డిసెంబర్ 19, 2025 సంవత్సరంలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలా సీక్వల్ సినిమాలను ఈ విధమైన పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ డేట్ సహా ఎనౌన్స్ చేయడం చరిత్రలో మునుపెన్నడు జరుగలేదని చెప్పాలి. ప్రస్తుతం అవతార్-2 అయితే డిసెంబర్ 18, 2020 కల్లా తీసుకురావాలని చూస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు జేమ్స్ చేస్తున్న కృషికి ఫలితంగా అవతార్ సీక్వల్స్ కూడా అవతార్ రేంజ్ లో ఫలితాన్ని అందుకోవాలని ఆశిద్దాం.