ప్రభాస్ సాహో టైటిల్ లోగో

బాహుబలితో ప్రభాస్ రేంజ్ ఏంటో తెలిసిందే.. రిలీజ్ అవుతున్న బాహుబలి-2తో మరో మెట్టు ఎక్కబోతున్న ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ డైరక్షన్ లో సాహో సినిమా చేస్తున్నాడు. రన్ రాజా రన్ డైరక్టర్ గా ఆ సినిమా హిట్ అందుకున్న సుజిత్ రెండో సినిమానే ప్రభాస్ రేంజ్ హీరోతో సినిమా చేస్తున్నాడు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తమిళ హింది మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. 

యువి క్రియేషన్స్ పతాకంలో వంశీ ప్రమోద్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా టీజర్ బాహుబలి-2తో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ పోస్టర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇంగ్లీష్ లెటర్స్ తో టైటిల్ పోస్టర్ వచ్చింది. సినిమా మూడు నాలుగు భాషల్లో రిలీజ్ అవుతుంది కనుక ఇంగ్లీష్ లో రిలీజ్ చేస్తే ఏ గొడవ లేకుండా ఉంటుందని అలా చేశారు. టైటిల్ లోగో మాత్రం ప్రభాస్ మళ్లీ ఏదో మ్యాజిక్ చేస్తాడని అనిపిస్తుంది. మరి టీజర్ తో ఎలాంటి షాక్ ఇస్తాడో చూడాలి.