బాహుబలి కన్నా ఈగ గొప్ప సినిమా..!

రాజమౌళి దగ్గర పనిచేయడం యుద్ధం చేసినట్టే.. డైరక్టర్ ను సాటిస్ఫై చేయడం చాలా కష్టం. అయినా సరే తన పనితనం చూపించేందుకు రాజమౌళితో ఉండాలని కోరుకుంటా అంటున్నాడు బాహుబలి కెమెరా మన్ సెంథిల్ కుమార్. బాహుబలి తెర మీద అంత అందంగా కనిపించడానికి జక్కన్నతో పాటే సెంథిల్ కుమార్ కష్టం కూడా ఉంది. అయితే బాహుబలికి తాను కష్టపడిన దాని కన్నా ఈగ కోసం ఎక్కువ కష్టపడ్డా అని చెబుతున్నాడు సెంథిల్ కుమార్. 

క్యారక్టర్స్ పక్కన గ్రాఫిక్స్ వాడటం కామనే కాని మెయిల్ క్యారక్టర్ ఈగను గ్రాఫికల్ గా షూట్ చేయడం కాస్త కష్టం. అందుకే ఈగ కోసం తన కెరియర్ లో చాలా కష్టపడ్డానని అంటున్నాడు సెంథిల్ కుమార్. ఏప్రిల్ 28న బాహుబలి-2 ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయం వెళ్లడించాడు సెంథిల్ కుమార్. కెమెరా మన్ గా అతను చెప్పింది నిజమే అయినా ఈగ కన్నా బాహుబలి కలెక్ట్ చేసిన వసూళ్లు ఎక్కువ. ఆ లెక్కన చూస్తే ఈగ కన్నా బాహుబలి ఎన్నో రెట్లు ఎక్కువ అనిపిస్తుంది.