ఇద్దరిలో ఓటు ఎవరికి..?

సమంత అనుష్క ఇద్దరు మంచి నటీమణులే.. ఇద్దరు ఎవరికి వారు తమని తాము ప్రూవ్ చేసుకున్నారు. ఏ క్యారక్టర్ ఇచ్చినా సూపర్ టాలెంటెడ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టే సమంత, సినిమా కోసం ఎలాంటి రిస్క్ తీసుకుని అయినా చేసే అనుష్క ఇలా ఇద్దరికి సెపరేట్ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ టాలెంట్ ఉంది. అయితే ఓ సినిమాలో పాత్రకు ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలా అనే కన్ ఫ్యూజన్ ఏర్పడిందట.

మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా మహానటి నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. జమున పాత్రలో ముందు సమంతను అనుకున్నారు కాని ఎందుకో ఆ పాత్ర కన్నా జర్నలిస్ట్ పాత్రలో సమంత బాగుంటుందని ఆమెను ఓకే చేశారు. ఇక అనుకున్న జమున పాత్రకు స్వీటీ అనుష్కను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే ప్రస్తుతం లావెక్కిన అనుష్క ఆ పాత్రకు సూట్ అవదని తెలిసి మళ్లీ మొదట అనుకున్న సమంతకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని అంటున్నారు. చిత్రయూనిట్ మొత్తం సమంతకే ఓటేస్తున్నారట. సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తే అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడమే అని అంటున్నారు.